తెలంగాణాను బి.ఆర్.ఎస్ పార్టీ అప్పులకుప్పగా ,స్కాముల మయంగా మార్చేసి,కాంగ్రెస్ పై బెదిరింపులకు దిగుటమా హావ్వా
కేంద్ర స్థాయిలో పార్టీ పెట్టిన బిఆర్ఎస్ పాత్రి తెలంగాణానాని గత 10 సంవత్సరాలుగా పాలించి ,భాగ్యనగలని దగ్గరవుంచుకుని ..బాకీల రాష్ట్రం గా ,అప్పుల కుప్పగా మార్చేసింది ,ఇందుకు సంబంధించిన ఎన్నో స్కాములు బయటపడుతున్నాయి ,అందుకు నిదర్శనం , గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ కేవలం విద్యుత్ సంస్థల కోసమే రూ.80 వేల కోట్లకుపైగా అప్పులు చేసింది. ఈ విషయం ఆ పార్టీ గద్దె దిగే వరకూ ఎవరికీ తెలియదు. సివిల్ సప్లయ్ శాఖలో రూ.200 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ విషయం కూడా ఎవరికీ తెలియదు. ఇక కాళేశ్వరం, నీటిపారుదల శాఖ సమీక్ష చేస్తే వందల కోట్ల అప్పులు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతోంది. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై స్వేతపత్రం విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఇది ఇన్నాళ్లూ అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ నేతలకు మింగుడు పడడం లేదు. తమ పాలనలో చేసిన అక్రమాలు, కప్పి పుచ్చిన అప్పులు వెలుగులోకి వస్తుండడంతో గులాబీ నేతల్లో గుబులు మొదలైంది
పథకాలు, ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలు ఇలా ఏది చూసినా ప్రస్తుతం అప్పులు, నష్టాలే వెలుగులోకి వస్తున్నాయి. వీటిని బయటపెట్టి బాధ్యులపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తోంది. మరోవైపు వాస్తవాలను ప్రజల ముందు పెడతామని మంత్రులు పేర్కొంటున్నారు. దీంతో అప్రమత్తమైన బీఆర్‌ఎస్ నేతలు తమపై చర్యలు తీసుకోవాద్దని కోరుతున్నారు. ఇందుకోసం కాంప్రమైజ్ రాజకీయాలకు తెర తీస్తున్నారు. ‘‘తొమ్మిదిన్నరేళ్లు మేం అధికారంలో ఉన్నాం. ఎవరిపైనా కక్ష సాధించలేదు. కేసీఆర్‌కు పనితనం తప్ప పగతనం తెలియదు. తాము పగసాధించాలనుకుంటే.. ఇప్పటికే సగం మంది కాంగ్రెస్ నాయకులు జైల్లో ఉండేవారు’’ అంటున్నారు గులాబీ నేతలు. మాజీ మంత్రి హరీశ్‌రావు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించడం ఇప్పడు తెలంగాణ పాలిటిక్స్‌లో చర్చనీయాంశమైంది. మేము అరెస్ట్ చేయలేదు కాబట్టి..మీరు కూడా మా తప్పులను చూసీ చూడనట్లువదిలేయాలి. కక్ష సాధింపు చర్యలకు దిగొద్దు’’ అని ఇండకేషన్ ఇస్తున్నారు. అంటే పరోక్షంగా తమ పాలనలో తప్పులు జరిగాయని, వాటిని పెద్దగా చేసి చూపొద్దని కోరుతున్నారు. అదే జరిగితే భవిష్యత్‌లో తాము కూడా అదే పని చేస్తామని సున్నితంగా హెచ్చరిస్తున్నారు.అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ప్రజలకు విసుగు వస్తే, పాలకులపై ఆగ్రహం కలిగితే ఫలితం ఎలా ఉంటుందో బీఆర్‌ఎస్ నేతలకు అర్థమైంది. ఇన్నాళ్లూ కేసీఆర్ తప్ప తెలంగాణకు దిక్కు లేదు అన్న నేతలు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడు కూలుతుందో.. తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉంటే బాగుండు. తమ వైఫల్యాలను ప్రజలక చెప్పకుంటే బాగుండు అని చూస్తున్నారు
అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని ఆలస్యంగ అర్థం చేసుకున్న నాయకుల ఇప్పుడు కక్ష సాధింపులు వద్దని, కాంప్రమైజ్ అవుదామని సంకేతాలు ఇస్తున్నారు. కానీ ఈ విషయాలను తెలంగాణ సమాజం గమనిస్తోంది. తాజాగా తీర్పు ఇచ్చినట్లుగా రాబోయే రోజుల్లో కూడా తమ తీర్పు వెల్లడిస్తారని విశ్లేషకులు అంటున్నారు.తమపై కక్ష సాదించొద్దని ఒకవైపు కోరుతున్న బీఆర్‌ఎస్ నాయకులు.. మరోవైపు కాంగ్రెస్‌ను గద్దె దించేందుకు గోతులు తవ్వుతున్నారు. ఇందుకు కడియం శ్రీహరి, రాజాసింగ్, హరీవ్‌రావు చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనమని బీఆర్‌ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు రాజీ రాజకీయాలకు ప్రయత్నిస్తూనే మరోవైపు కాంగ్రెస్ సర్కార్‌ను వీలైనంత త్వరగా పడగొట్టాలని చూడడం చర్చనీయాంశమైంది.
Comments
0 comment