చంద్రబాబు ప్రమాణస్వీకారం లో హైలెట్స్

ఐదు సంవత్సరాల కల ,రాక్షస రాజ్యం నుండి బయటపడాలని ప్రతి ఒక్కరు ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది ,విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా చంద్రబాబు ప్రమాణస్వీకారము కన్నుల పండుగగా జరిగింది 

 

 

1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం మధ్యాహ్నం 11.27 గంటలకు కృష్ణాజిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో చంద్రబాబు చేత   గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. 

 

2. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి   ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ, రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

 

3.  నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌లో అధికారులు కీలక మార్పులు చేశారు.  చంద్రబాబు కాన్వాయ్‌ వాహనాల్ని మంగళవారం రాత్రి అధికారులు మార్చారు. ప్రస్తుతం కాన్వాయ్‌లో ఉన్న పాత సఫారీ వాహనాలు కండిషన్‌లో లేకపోవడంతో.. వాటి స్థానంలో పాత ఫార్చ్యునర్లను ఏర్పాటు చేశారు.

 

4.  ఆంధ్రప్రదేశ్ మంత్రిగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌  ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కల్యాణ్ కు చంద్రబాబు కేబినెట్ లో కీలక శాఖ దక్కనుంది. 

 

5. ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రిగా చంద్రబాబు  ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోడీకి గన్నవరం విమానాశ్రయంలో   చంద్రబాబు స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఆయనతో కలిసి ప్రమాణ స్వీకార వేదిక వద్దకు తోడ్కొని వచ్చారు. 

 

6. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అమరావతి రైతులు ఎల్ఈడీ స్క్రీన్లపై వీక్షించారు.   తుళ్లూరులో రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని వీక్షించడం కోసం ప్రత్యేకంగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.  

 

7.   చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి తెదేపా కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.  అమరావతి పరిధిలోని వెంకటపాలెం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు తెదేపా నేతలు పడవల్లో వెళ్లారు. పడవలకు పార్టీ జెండాలను కట్టి జై చంద్రబాబు, జై తెలుగుదేశం నినాదాలతో సందడి చేశారు.

 

8. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం నారా  లోకేశ్ తండ్రి చంద్రబాబుకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు.

 

9. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన కేబినెట్ లో తొలి సారి ఎమ్మెల్యేలుగా గెలిచిన పది మందికి స్థానం కల్పించారు. వీరిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉన్నారు.  నారా లోకేష్ గతంతో మంత్రిగా పని చేశారు. 

 

10.  పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయులు, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి గతంలో పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినా ఎన్నడూ మంత్రులుగా పని చేయలేదు.  తొలి సారిగా వీరికి ఇప్పుడు చంద్రబాబు కేబినెట్ లో  స్థానం దక్కింది.