తప్పు తెలుసుకుని , చంద్రబాబుని ఒక్క ఛాన్స్ అడిగిన అధికారులు

ఆంధ్రప్రదేశ్ లో దాదాపు నాలుగు సంవత్సరాలకు పైగా వైసీపీ నాయకులు చెప్పినట్లు చేసి అప్పటి జగన్ ప్రభుత్వం కోసం పని చేసిన వాలంటీర్ల జీవితాలు నేడు రోడ్డున పడ్డాయి. మన ప్రభుత్వమే వస్తుందని, మీకు మేము ఉన్నామని వైసీపీ నాయకులు చెప్పిన మాయమాటలు నమ్మి ఉద్యోగాలకు రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇప్పుడు మాకు మరో అవకాశం ఇస్తే చేసిన తప్పులు దిద్దుకుంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.2019లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత వాలంటీర్ల వ్యవస్థ వచ్చింది. వాలంటీర్లను అడ్డం పెట్టుకున్న వైసీపీకి చెందిన కొందరు నాయకులు టీడీపీ సానుభూతిపరులపై కక్షసాధింపులకు దిగారని ఆరోపణలు ఉన్నాయి. ప్రజాసేవ కోసం నియమితులైన వాలంటీర్లను వైసీపీ నాయకులు వాళ్ల పార్టీల అవసరాల కోసం ఉపయోగించుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయిటీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆరోపణలు చేసినా వైసీపీ నాయకులు కొంచెం కూడా వెనక్కి తగ్గలేదు. అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటించిన తరువాత వాలంటీర్లను పూర్తిగా వైసీపీ కోసం ఉపయోగించుకున్నారు. ఈసీ హెచ్చరికలతో వాలంటీర్లతో రాజీనామాలు చేయించి పూర్తిగా వైసీపీ కోసం పని చెయ్యాలని ఆ పార్టీ నేతలు వాలంటీర్ల మీద ఒత్తిడి తెచ్చారు.ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ల గౌరవ వేతనాలను (జీతాలు) రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు పెంచుతామని చంద్రబాబు చెప్పిన మాటలను వాలంటీర్లు నమ్మలేదు. మనం మళ్లీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల ఉద్యోగాల ఫైల్ మీద తొలి సంతకం చేస్తానని, మీకు అండగా నేను ఉంటానని వైఎస్ జగన్ చెప్పిన మాటలను వాలంటీర్లు నమ్మారు. వైసీపీ ప్రలోభాలకు లొంగిపోయిన వేలాది మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.