శ్రీశైలం లో కన్నుల పండుగ మల్లన్న రధోత్సవం..!

ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవ లింగం అష్టదశ శక్తిపీఠంలో ఆరోవ శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలోకనుల పండగ రథోత్సవ కార్యక్రమం జరిగింది. నంద్యాల జిల్లా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ఉగాది మహోత్సవాలను పురస్కరించుకొనిఉగాది పండగ పర్వదినానమంగళవారంసాయంత్రం 5 గంటల నుంచి రథోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి మంగళవాయిద్యాల నడుమ రథశాల వద్దకు తీసుకువచ్చారు.రంగ రంగలు పూలతో అలకరించిన రథంపై స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చారు. శోభయామనంగా రథంపై ఊరేగించారు.ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా పోలీస్ అధికారులు బందోబస్తు మధ్యవందల మంది దేవస్థాన అర్చకులు,ఆలయ ఈవో డి పెద్ది రాజు.. వారికుటుంబ సభ్యులుఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఉగాది పండగ పర్వదినాన ఈ రథోత్సవ కార్యక్రమాన్ని ఎందుకు జరుపుకుంటారంటే..కర్ణాటక ప్రాంత వాసులకు ఉగాది పండగ ఎంతో ప్రాధాన్యతమైనది. శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారు, కర్ణాటక ప్రాంతానికి చెందినవారుగాకర్ణాటక ప్రాంతానికి ఆడపడుచు గా కర్ణాటక ప్రాంత వాస్తవ్యూలుచెప్తూ ఉంటారు.అందువలన కర్ణాటక రాష్ట్రంలో ఉన్న వేలాది మంది భక్తులందరూ కాలినడక ప్రయాణంతో శ్రీశైలం చేరుకోవడం జరిగింది.వీరందరూ భ్రమరాంబిక అమ్మవారి కోసంకొన్ని వందల కిలోమీటర్లు కాలినడక ప్రయాణంతో శ్రీశైలం చేరుకొని అమ్మవారిని దర్శించుకునిఉగాది పండుగ పర్వదినాన అమ్మవారికి వారి పద్ధతుల ప్రకారం పూజ కార్యక్రమాలు శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వేలాదిమంది కర్ణాటక భక్తులు పాల్గొనితేరును లాగడం జరిగింది.తేరును లాగిన వెంబడేఅమ్మవారికి పూజ కార్యక్రమాలు నిర్వహించుకొని కర్ణాటక ప్రాంత వాస్తవ్యూలుతిరుగు ప్రయాణం అయ్యారు.అందువలన ఉగాది పండుగ అంటేనేశ్రీశైలంలో కర్ణాటక భక్తాదులువేల సంఖ్యల్లో దర్శనమిస్తూ ఉంటారు.