మీరు ధరించిన బంగారానికి ఇన్సూరెన్స్ ఉందా ?

నేటి కాలం విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది డబ్బుతో పాటు విలువైన వస్తువులను చోరీకి గురి చేస్తున్నారు. ఇక బంగారం దొంగతనాల గురించి తరుచూ వింటూంటాం. ఇప్పటి వరకు బైక్ లేదా కారును ఎవరైనా దొంగిలిస్తే అప్పటి వరకు ఇన్సూరెన్స్ చేయించుకున్న వాళ్లు ఏదో విధంగా రికవరీ చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు బంగారు ఆభరణాలు చోరికి గురైనా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అయితే మిగతా వాటిలాగే ముందుగానే దీనికి ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీలు బంగారంపై ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ చేయిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..బంగారం కాపాడుకోవడం చాలా కష్టం. కానీ చాలా మందికి బంగారు ఆభరణాలు ధరించాలన్న కోరిక ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక శుభకార్యాలు, పండుగల్లో ఆభరణాలు ధరించి ఆ తరువాత వాటిని లాకర్లలో పెడుతూ ఉంటారు. కానీ లాకర్లో పెట్టినందుకు బ్యాంకులు ప్రత్యేకంగా చార్జీలు వసూలు చేస్తాయి. అంతేకాకుండా అవసరం ఉన్నప్పుుడు బంగారం తీసుకోవాలనే ఈజీగా ఉండదు. అందువల్ల లాకర్లో కంటే వీటిపై ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఎంతో లాభం ఉంటుంది.

ఇప్పటి వరకు వాహనాలు చోరికి గురైతే ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ వర్తించేది. కానీ ఇప్పుడు బంగారం దొంగిలించినా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. HDFC ERGO, ICICI Lembard, Reliance General Insurance, Royal Sundaram, Oriental Insurance, Bajaj Aliance, SBI General కంపెనీలు బంగరానికి ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి. అయితే బంగారంనకు ఇన్సూరెన్స్ వర్తించాలంటే ప్రతీ సంవత్సరం కొంత ప్రీమియం కట్టాల్సి ఉంటుంది.

బంగారం సేప్ గా ఉండాలంటే లాకర్లో పెడుతూ ఉంటారు.ఇలా లాకర్లో పెట్టడం వల్ల వాటికి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ అవసరం ఉన్నప్పుడు వేసుకోవడానికి వీలుండదు. అదే ఇన్సూరెన్స్ కడితే ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవచ్చు. ఎవరైనా దొంగిలిస్తే దానిపై ఇన్సూరెన్స్ వస్తుంది. అందువల్ల బంగారానికి ఇన్సూరెన్స్ చేసుకోవడం ఉత్తమం.