జనసేన నాయకులు మురాలశెట్టి సునీల్ గారి ఆద్వర్యం లో ఇంటర్ ,డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు

పిఠాపురం నియోజక వర్గం లో పవన్ కళ్యాణ్ గారు గెలుపుతో జనసేన కేడర్ మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతుంది  ఇందులో భాగంగా జనసేన నాయకులు మురాలశెట్టి సునీల్ గారు ఆద్వర్యం లో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలతో పాటు, ఉన్నత విద్యని అభ్యసించే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు ,ఈ కార్యక్రమం లో భాగంగా, మురాలశెట్టి సునీల్ గారు మాట్లాడుతూ ఇంటర్  2023-24 పాస్ అయిన ఎంపీసీ, బైపీసీ ,ఎం.ఎల్ .టి చదువుతున్న 20 సంవత్సరాల లోపు పురుష  విద్యార్థులకు హైదరాబాద్ లో  ఉద్యోగ అవకాశాలు తో పాటు ఉన్నత విద్యని అభ్యసించవచ్చని,

అలాగే Bsc  కెమిస్టరీ 2021/22/23/24 సంవత్సరాలలో ఉత్తీర్ణులైన పురుష  విద్యార్థులు ఈనెల 23 వతేది ఆదివారం పిఠాపురం మున్సిపల్  హై స్కూల్ లో జరిగే ఇంటర్వ్యూ లకు పదవతరగతి మరియు  ఇంటర్ పాసైన  ధ్రువ పత్రాలతో ,ఆధార్ కార్డు ,పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్ తో హజరు కావాలని,మరిన్ని వివరాలకు 83283-81842 వాట్సాల్ప్ నెంబర్ ని సంప్రదించవచ్చు అని ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు 

 

*********సీనియర్ జర్నలిస్ట్ మురళి**********