కేరళలో ఇంకుడు గుంత తవ్వు తుంటే నిధి దొరికింది

ప్రపంచం లో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ,అందులో నిధి నిక్షేపాలు ఒకటి ,ఎవరికీ ఎప్పుడు ఎలా నిధి దొరుకుతుందో చెప్పలేం అంత దైవేచ్ఛ అంటూ వుంటారు పెద్దలు ,కేరళలో కన్నూర్ జిల్లాలోని చెంగలాయిఅనే ప్రాంతంలోని రబ్బర్ తోటలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ గుంత తవ్వడం మొదలుపెట్టారు.అయితే ఆ కూలీలు ఊహించని ఖజానా దొరికింది.గుంత తవ్వుతుండగా వారికి ఒక డబ్బా తగిలింది.దానిని బయటకు తీసి చూసే లోపే అది బాంబు అయి ఉంటుందేమో అని భయపడ్డారు.తర్వాత దానిలో బ్లాక్ మ్యాజిక్ ఉందేమో అని కూడా అనుమానించారు.కానీ, చివరికి ధైర్యం చేసి దానిని తెరిచి చూసేసరికి లోపల విలువైన నగలు, పురాత నాణేలు దాగి ఉన్నాయి! వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వగా వారు వచ్చి ఆ ఖజానాను స్వాధీనం చేసుకున్నారు.ఈ నగలు, నాణేల విలువ ఎంత? ఎంత పురాతనమైనవి? అనేది పురావస్తు శాఖ వారు పరిశీలించాకే తేల్చాల్సి ఉంది.గురువారం ఖజానాను స్వాధీనం చేసుకున్న పోలీసులు శనివారం దానిని స్థానిక కోర్టులో ప్రదర్శించారు.ఇక్కడ మరిన్ని అమూల్యమైన నగలు, పురాతన నాణేలు ఉండే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.గుంత తవ్వే సమయంలో ఖజానాను కనుగొన్న మహిళా కార్మికులు, దానిలో ఇంత విలువైన వస్తువులు ఉంటాయని ఊహించలేదని చెప్పారు.గుంతలో మెరుస్తున్నది కనిపించిందని, దగ్గరకు వెళ్లగా అది పాత డబ్బా అని తెలుసుకున్నామని మహిళా కూలీలలో ఒకరు చెప్పారు.“ముందు అది బాంబు అయి ఉంటుందేమో అనుకున్నాము.తర్వాత దానిలో బ్లాక్ మ్యాజిక్‌కు సంబంధించిన వస్తువులు ఉంటాయేమో అని కూడా అనుమానించాం.” అని ఆమె వివరించారు.కానీ డబ్బా తెరిచి చూసేసరికి వారి ఆశ్చర్యానికి అంతే లేదు! లోపల బంగారు, వెండి నాణేలు, విలువైన మణులు, పతకాలు వంటి ఖరీదైన వస్తువులు దొరికాయి.ఆ ప్రాంతానికి పరిశీలనకు వచ్చిన పోలీస్ అధికారి మాట్లాడుతూ, “ఇప్పటికే పురావస్తు శాఖకు ఈ విషయాన్ని తెలియజేశాము.

ఆ ప్రాంతంలో మరింత తవ్వకాలు జరపాలా వద్దా అనేది వారి నిర్ణయం.వారు పరిశీలించిన తర్వాతే దొరికిన వస్తువుల పురాతనం తెలుస్తుంది” అని చెప్పారు.ఇదే సమయంలో అంటే శనివారం ఉదయం, అదే ప్రాంతంలో మూడు వెండి నాణేలు, ఒక బంగారు మణి కూడా దొరికినట్లు స్థానికులు తెలిపారు.