కన్నీరు పెట్టుకున్న కొడాలి నాని

కోడాలి నాని.....  వైసీపీ కి ఫైర్ బ్రాండ్ లలో నెం -01 అంతేకాదు బొచ్చుగాడు ,సన్నాసి ,ఎదవ ,లోఫర్ గాడు ఇలాంటి పదాలతో చంద్రబాబు ,లోకేష్ ,ని ఎన్నో సార్లు ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్టేవాడు ,ఈ ప్రెస్ మీట్లను చూస్తూ జగన్ ఎంతో ఆనంద పడేవాడు అని టాక్ ,కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది ,అది 2024 ఎలక్షన్స్ రూపంలో వచ్చింది ,ఎప్పుడైతే వైసీపీ బారి ఓటమిని చవి చూసిందో కోడాలీకి బాడ్ టైం స్టార్ట్ అయ్యింది అనే చెప్పాలి , కోడాలి నాని గుడివాడ నుండి ఓటమి పాలయ్యాక ఎన్నికలకు ముందు ఈసారి ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానంటూ కొడాలి నాని సవాల్ విసిరిన నేపథ్యంలో నాని ఓడిపోయాక ఆయన నివాసాన్ని ముట్టడించిన టీడీపీ శ్రేణులు.. ఎప్పుడు సన్యాసం చేస్తున్నావని నినాదాలు చేశారు. మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేత పొట్లూరి దర్శిత్ నేతృత్వంలో భారీగా తరలివచ్చిన కార్యకర్తలు రాళ్లు, కోడి గుడ్లను విసిరి కోడలికి సవాల్ విసిరారు అసలు కొడాలి నాని అంటే గుడివాడలో ఆయనే కింగ్. దాదాపు 20 ఏళ్ల పాటు పార్టీలు మారినా గుడివాడను తన అడ్డాగా మార్చుకుని రాజకీయాలు నడిపిన సీనియర్ నేత. కానీ ఒక్క ఓటమి ఆయన పరిస్ధితి దారుణంగా మార్చేసింది.  టీడీపీ, వైసీపీలో 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా గెలిచి కంటిచూపుతోనే రాజకీయాలు నడిపిన దిగ్గజ నేత కొడాలి నానికి అధికారం పోయాక మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. గుడివాడకు రావాలంటేనే కష్టంగా మారిపోయిన పరిస్ధిత్తి

ఇలాంటి సమయం లోరెండు దశాబ్దాలుగా నిరాటంకంగా రాజకీయాలు చేస్తూ ఏ చిన్న కార్యక్రమం అయినా వేడుకగా జరుపుకునే కొడాలి నానికి గుడివాడ పోలీసులు భారీ షాకిచ్చారు. ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోకుండా అడ్డుతగిలారు. కొడాలి నాని పుట్టినరోజు వేడుకలకు సిద్ధమైన ఆయన అభిమానులు, అనుచరులకు భారీ షాక్ ఇస్తూ అనుమతి నిరాకరించారు. అంతే కాదు కొడాలి నాని ఫ్లెక్సీలు కూడా కట్టకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అంతే కాదు ఆయన అనుచరులకూ పోలీసులు హెచ్చరికలు కూడా చేశారు .గుడివాడ పట్టణంలో 20 ఏళ్లుగాా పోలీసులైనా, రాజకీయ నేతలైనా, రాజకీయమైనా కొడాలి నాని కన్నుసన్నల్లోనే సాగేది. అలాటిది  ఏకంగా పట్టణంలో పట్టినరోజు వేడుకలు కూడా నిర్వహించకుండా పోలీసులు అడ్డుకున్నారు దీనితో చాల వరకు మనస్తాపానికి గురయ్యాడు కొడాలి  నాని,చేసినతప్పులకు పశ్చాత్తాప పడుతున్నట్టు వినికిడి ,ఇది ఇలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వ్యతిరేక పోస్టులు పెడుతున్నారనే కారణంతో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తోన్న విషయం తెలిసిందే.మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టే వారికి చంద్రబాబు హెచ్చరికలను జారీ చేశారు. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటామని, ఆడబిడ్డల జోలికి వస్తే మాత్రం సహించబోమని అన్నారు. వ్యక్తిత్వం హననం చేసే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకూ కేసుల బెడద తప్పట్లేదు. తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌ రెడ్డిని సోషల్ మీడియాలో ప్రశ్నించాడనే కారణంతో ఇటీవలే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పైనా కేసులు నమోదయ్యాయి. దీనికి అక్కడితో బ్రేకులు పడట్లేదు. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. విశాఖపట్నానికి చెందిన న్యాయ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడో టౌన్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు,ఇది ఇలా ఉంటే మారుతున్న రాజకీయ పరిణామాలను చూస్తున్న కొడాలి నాని తన సన్నిహితుల దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నారట ,ఇంతదారుణం గా కూటమీ ప్రభుత్వం తనని టార్గెట్ చేస్తుంది అని అనుకోలేదని ,చేసిన తప్పులకు ప్రాయచిత్తమే ఉండదా అంటూ వాపోయారట,ఏది ఏమైనా ప్రత్యర్దులపై కూటమి జుళిపిస్తున్న కొరడా దెబ్బలకు ఒక్కొక్కరుగా దిగొస్తుంటే మరికొందరు వైసీపీ పార్టీని  వీడి వెళ్లిపోతున్నారు