నేటి నుంచి ఉచితంగా ఇసుక.. ఇలా బుక్ చేసుకోండి!

నేటి నుంచి 20 జిల్లాల్లోని 120 స్టాక్ పాయింట్ల ద్వారా ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. 

ఇసుక డిపోకు వెళ్లి లారీ, ట్రాక్టర్, మినీ ఆటోల్లో తీసుకెళ్లొచ్చు. 

ఇసుక తవ్వినందుకు, లోడ్ చేసినందుకు, డిపోల వరకు తరలించినందుకు లేబర్, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

సగటున రోజుకు ఒక వినియోగదారుడికి 20 టన్నులే పంపిణీ చేస్తారు. 

ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ సమర్పించాల్సి ఉంటుంది.