పిన్నేల్లికి బైయిలు రాకపోవడానికి కారణం ?

అధికార మదం తో చేసిన కొన్ని కొన్ని పనులు అనర్ధాలకు దారి తీస్తాయి అనాదం లో పిన్నెళ్లి సాక్ష్యం ఎందుకంటే  ఈవీఎం విధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిలు ఎందుకు రాలేదన్న విషయంలపై న్యాయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తున్న సంఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. దీంతో ఆయనపై కేసు బుక్కైంది. ముందస్తు బెయిలుపై కొన్ని రోజులు పిన్నెల్లి అరెస్టు నుంచి తప్పించుకున్నారు. అయితే  ముందస్తు బెయిలు గడువు ముగియడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో నెల్లూరు జైలుకు ఆయనను తరలించారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆయనను పరామర్శించేందుకు నెల్లూరు జైలుకు వెళ్లారు. పరామర్శ తరవాత జైలు బయట విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అక్కడ చేసిన ప్రసంగంలో జగన్ పిన్నెల్లిని అడ్డంగా బుక్ చేసేశారు. ఔను పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేశారు. నిజమే. అందులో తప్పేముంది అంటూ ఆవేశంగా మాట్లాడారు. పాల్వాయిగేట్ పోలింగ్ బూత్ లో రిగ్గింగు జరుగుతుండటంతో ఆవేశం ఆపుకోలేక  పిన్నెల్లిఈవీఎంను ధ్వంసం చేశారు అంటూ కమిట్ అయిపోయిన జగన్ పిన్నెల్లిని అడ్డంగా బుక్ చేసేశారు. పిన్నెల్లేమో కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసి తానా రోజు అసలు పాల్వాయ్ గేట్  పోలింగ్ బూత్ కే వెళ్లలేదని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఆయన బెయిలు పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ఎందుకంటే ఆయనకు బెయిలు ఇవ్వవద్దంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తమ వాదనలో ప్రధానంగా నెల్లూరు జెయిలు బయట పిన్నిల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారంటూ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. పిన్నెల్లి అబద్ధం చెబుతున్నారనీ, ఆయన పార్టీ అధినేతే ఈవీఎం ధ్వసం చేసింది పిన్నేల్లే అని స్పష్టంగా చెప్పారంటూ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో కోర్టు పిన్నెల్లికి బెయిలు నిరాకరించింది.  దీంతో పిన్నెల్లి నమ్మకున్నందుకు నిండా ముంచావు కదా జగనన్నా అంటూ తలబాదుకుంటున్నారు.