"పిఠాపురం డిప్యూటీ సీఎం గారి తాలూకా" అంటూ... చేబ్రోలు దళిత వాడలో జనసేన సంబరాలు..!

జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్  ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు  చేసిన కృషి అనన్య సామాన్యం,వైసీపీ పాలనకు ప్రజలు స్వస్తి పలికి, కూటమి ప్రభుత్వాన్నీ గద్దెనెక్కించే వరకు ప్రతి జనసైనికుడు రేయింబవళ్లు కష్టపడి తమ ప్రియతమ నాయకుడిని గెలిపించుకున్నారు,జనసైనికుల కలలను సాకారం చేసుకున్నారు అలాగే బుధవారం  శ్రీ కొణిదల  పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా భాద్యతలు చేపట్టారు ,ఇందులో భాగంగా తమ ప్రియతమా నాయకుడు  అధికార భాద్యతలు చేపట్టిన సందర్బంగా ,పిఠాపురం నియోజక వర్గం ,గొల్లప్రోలు మండలం చేబ్రోలు దళిత వాడ (ఎస్.సి  కాలనీ ) లో జనసైనికులు,  వీరమహిళలు జరిపిన  సంబరాలు అంబరాన్నంటాయి,

ఈ కార్యక్రమంలో ఓదూరి నాగేశ్వరావు ,చల్లా  చినబాబు గారు ముఖ్య అతిధులుగా అంబేద్కర్ యువసేన ఆద్వర్యం లో భారత రాజ్యాంగ నిర్మాత  డాక్టర్ బి .ఆర్  అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ సేవలను కొనియాడారు,తదుపరి కేక్  కట్టింగ్ చేసి  తమ ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక వర్గాన్ని దేశం లోనే ఒక మోడరన్  నియోజక వర్గంగా చేస్తాను అని చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నారు ,ఇందులో భాగంగా ఓదూరి నాగేశ్వరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చేతలు మనిషే గాని మాటలు మనిషి కాదు ,అలాంటి వ్యక్తి మన పిఠాపురం నుండి పోటీ చెయ్యడం ,మనం గెలిపించుకోవడం మన అదృష్టం అని చెప్పుకొచ్చారు ,చల్లచినబాబు మాట్లాడుతూ మన చేబ్రోలు దళిత వాడాలో గత ప్రభుత్వం లో నెరవేరని అభివుద్ది కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ ఆద్వర్యం లో నెరవేరుతాయని ,అందరికి మంచిరోజులొచ్చాయని చెప్పుకొచ్చారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి సూరిశేట్టి జయకృష్ణ మాట్లాడుతూ SC ,ST లకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీరికి ప్రత్యేకమైన నిధులు ఏర్పాటు చేసి వీరిని అభివృద్ధి పదాలవైపు నడిపిస్తారని చెప్పుకొచ్చారు,ఇక జనసైనికుడు బుద్దాల  చంటి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టి 24 గంటలు గడవకపోయినా ఆయా శాఖ అధికారులను ప్రశ్నిస్తూ అభివృద్హికి ప్రణాళికలు వెయ్యడం ఎంతో ఆనందినిచ్చింది  అని చెప్పుకొచ్చారు ,ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు ఉలవకాయల సత్యనారాయణ, దమ్ము చిన్న ,పెద్దింటి శివ , కడారి సతీష్ కుమార్ ,నాగమణి ,సత్తిబాబు దిబ్బిడి సురేష్ పెద్ద ఎత్తున  జనసైనికులు,వీరమహిళలు పాల్గొన్నారు 

*******"సీనియర్ జర్నలిస్ట్ మురళి మోహన్" *********

"సీనియర్ జర్నలిస్ట్ మురళి మోహన్"