వివాదాస్పద నటి శ్రీరెడ్డి అరెస్ట్ ?

తెలుగు సినిమా పరిశ్రమలో వివాదాస్పద నటి శ్రీరెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్దమైంది. సోషల్ మీడియా, యూట్యూబ్‌లో రాజకీయ నేతలపై అసభ్య కామెంట్స్ చేసిన ఈ తారపై కర్నూలులో కేసు నమోదు కావడంతో ఆమెను అదుపులోకి తీసుకొనేందుకు పోలీసులు సిద్దమయ్యారు. ఈ క్షణంలోనైనా ఆమెను అరెస్ట్ చేసి విచారించే అవకాశం ఉందని పోలీసు, మీడియా వర్గాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక శ్రీరెడ్డి వివాదాస్పద అంశాల విషయంలోకి వెళితే.. తెలుగు మీడియాలో శ్రీరెడ్డి యాంకర్‌గా కెరీర్ ప్రారంభించారు. సాక్షిలో న్యూస్ రీడర్‌గా పనిచేశారు. ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించి పలు చిత్రాల్లో నటించారు. అయితే తనను వాడుకొని ఆఫర్లు ఇవ్వలేదు అంటూ పలువురు హీరోలు, దర్శకులపై సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టి ఫోటోలు షేర్ చేశారు.ఇక తెలుగు అమ్మాయిలను ఇండస్ట్రీలో కొందరు వాడుకొని వదిలేస్తున్నారు. ఔత్సాహిక తెలుగు యువతులకు అవకాశాలు ఇవ్వడం లేదు. కాబట్టి వారికి న్యాయం చేయాలని ఫిలిం ఛాంబర్ వద్ద అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేయడం సంచలనం రేపింది. ఆ తర్వాత క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం నడిపి దేశవ్యాప్తంగా పాపులర్ అయింది.ఇక హైదరాబాద్ నుంచి చెన్నైకి మకాం మార్చిన శ్రీరెడ్డి.. యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, నాగబాబు, అనిత తదితరులుతో అసభ్య పదజాలంతో, అశ్లీల వ్యాఖ్యలతో వీడియోలు ప్రొడ్యూస్ చేసి వివాదాస్పందంగా మారారు. అయితే ఓ దశలో ఆమె తీరు శృతిమించిందనే విమర్శలు కూడా వచ్చాయి.అయితే ఆమె ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ఆమె టీడీపీ కార్యకర్తలు పోలీసులకు కంప్లైంట్ చేశారు. కర్నూలులో టీడీపీ నేత మేకల వెంకట నాగరాజు ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 352, 353, ఐటీ యాక్ట్ 2000-2008 సెక్షన్ 66 కింద కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదుతోపాటు కొన్ని ఆధారాలు కూడా సమర్పించారు. ఈ ఆధారాలు రుజువైతే 2 నుంచి 3 సంవత్సరాల జైలుశిక్ష పడుతుందని లీగల్ నిపుణులు తెల్చారు.