అన్నమాట నిలబెట్టుకున్న రేవంత్
తెలంగాణా లో కాంగ్రెస్ విజయబావుటా ఎగురవేస్తుంది ,అందరు ఊహించిన ఊహా గానాలు అన్ని తారుమారు అయ్యాయి ,హస్తం . మ్యాజిక్ ఫిగర్ దాటి ఆధిక్యం కనబరుస్తోంది. దీంతో అధికారుల వైఖరిలో మార్పు వస్తోంది. ఇప్పటి వరకు బీఆర్‌ఎస్ సర్కార్‌కు అనుకూలంగా ఉన్న పోలీసులు ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఫలితాలను అంచనా వేస్తూ పోలీసులు అందుకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. ఏకంగారాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ కొద్దిసేపటి క్రితం రేవంత్ ఇంటికి వెళ్లారు. ఆయతోపాటు చాలా మంది ఐపీఎస్‌లు కూడా రేవంత్ ఇంటికి క్యూ కట్టడం ఆసక్తిగా మారింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. అంతకుముందు సీఎల్పీ నేతగా ఉన్న వైఎస్.రాజశేఖరరెడ్డి చేవెళ్ల నుంచి పాయాత్ర చేశారు. సుమారు 3 వేల కిలోమీటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నడిచారు. దీంతో 2004 ఎన్నికల్లో ఫలితాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. వైఎస్సార్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌కు తెలుగు ప్రజలు పట్టం కట్టారు. ఈ సదర్భంగా నాటి పోలీస్ అధికారులు కూడా ఎన్నికల ఫలితాలు వస్తుండగానే సీఎల్పీ నేతగా ఉన్న వైఎస్సార్ ఇంటికి అప్పటి డీజీపీ నాగేందర్ కుమార్ వెళ్లారు. తాజాగా ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ పోలీసులు అదే సంప్రదాయాన్ని కొనసాగించారుకాగ్రెస్ తెలంగాణలో దూసుకుపోతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో హంగామా కొట్లాడుతుంది. అంతటా సంబురాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు కూడా పోలింగ్ సరళిని అంచనా వేస్తున్నారు. గతంలో రేవంత్ పోలీసులను, డీజీపీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో ఆయన ఇంటికి ఐసీఎస్‌లు, ఐఏఎస్‌లు క్యూ కట్టడం ఆసక్తిగా మారింది.
Comments
0 comment