ఎన్టీఆర్ లక్కీ ఫిలో

సినిమా ఇండస్ట్రీలో జరిగిన కొన్ని కొన్ని విషయాలు చూస్తే చాలా విచిత్రం గా ఉంటాయి 

'కిక్', 'ఎవడు', 'రేసుగుర్రం', 'టెంపర్' వంటి హిట్ సినిమాలకు కథలు అందించి రచయితగా మంచి పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీ.. 2018 లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం కావాల్సి ఉంది. ఎన్టీఆర్ తో వంశీకి మంచి అనుబంధముంది. తారక్ నటించిన అశోక్, ఊసరవెల్లి, టెంపర్ వంటి సినిమాలకు వక్కంతం రైటర్ గా పని చేశాడు. ఆ అనుబంధంతోనే డైరెక్టర్ గా తన మొదటి సినిమాని ఎన్టీఆర్ తో చేయాలనుకున్నాడు వంశీ. ఎన్టీఆర్ కూడా ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడు. కానీ వక్కంతం చెప్పిన కథతో పూర్తిగా సంతృప్తి చెందని తారక్.. కొన్ని మార్పులు సూచించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ వంశీ వెళ్ళి బన్నీకి కథ చెప్పడం, 'నా పేరు సూర్య' అనే చిత్రం పట్టాలెక్కడం జరిగిపోయాయి. అయితే భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

'నా పేరు సూర్య' ఫలితంతో వంశీకి దర్శకుడిగా రెండో సినిమా అవకాశం రావడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. ఎట్టకేలకు నితిన్ తో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. మొదటి షో నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకొని, ఘోర పరాజయం దిశగా పయనిస్తోంది. దీంతో కథ విషయంలో సంతృప్తి చెందక ఎన్టీఆర్ తప్పించుకుంటే.. బన్నీ, నితిన్ మాత్రం చెరో ఫ్లాప్ ని ఖాతాలో వేసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.