కాలికి గాయమైన నిలబడే డైలాగ్స్ చెప్పిన శ్రీకాంత్

వందరూపాయలు సినిమా టికెట్ కొని ,సినిమా చూసేసిన తరువాత నచ్చకపోతే బాలేదు అని ఎంతో సింపుల్గా చెప్పేస్తాం కానీ , ఆసినిమా వెనుక కష్టం మాత్రం మనకి పనిలేదు అన్నట్టు చూస్తాం,అయితే మొన్న దేవర సినిమా షూటింగ్ లో శ్రీకాంత్ గాయం పాలై ,ఆగాయంతోనే డయలాగ్ చెప్పారట ,అసంగతేంటో చూద్దాం ...  శ్రీకాంత్ ప్రస్తుతం కారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటిస్తున్నాడు. విలన్‌గానూ ట్రై చేస్తున్నాడు. కానీ సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు. అఖండ చిత్రంలో విలన్‌గా కనిపించినా.. ఆ తరహా ఆఫర్లు మాత్రం మళ్లీ రాలేదు. సైడ్, సపోర్టింగ్ రోల్స్‌తోనే శ్రీకాంత్ కాలం గడిపేస్తున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్, ఎన్టీఆర్ దేవర వంటి భారీ ప్రాజెక్టుల్లో నటించేస్తున్నాడు. ఇప్పుడు శ్రీకాంత్ మెయిన్ పాత్రలో నటించిన కోటబొమ్మాళీ పీఎస్ అనే ఓ రీమేక్ చిత్రం విడుదల కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం శ్రీకాంత్ బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చాడు.

బిగ్ బాస్ షోలో ఏ ఒక్క ఎపిసోడ్ ఇంత వరకు మిస్ కాలేదట.. ఈ ఏడు సీజన్లలో ఏ ఒక్క ఎపిసోడ్ సైతం మిస్ కాలేదని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. అదే స్టేజ్ మీద శ్రీకాంత్ కాలికి ఉన్న పట్టీ గురించి నాగ్ అడిగాడు. ఇదెలా జరిగిందని నాగ్ అడగడంతో శ్రీకాంత్ అసలు విషయాన్ని వివరించాడు.

గోవాలో దేవర షూటింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగిందన్నాడు. ఇసుక దిబ్బలో పరిగెడుతుంటే.. కాలు బెణికిందని. చిన్న గాయమే కదా? అని షూటింగ్ చేస్తూనే వచ్చాడట. ఆ తరువాత కొద్ది సేపటికి వాపు ఎక్కిందట. దీంతో డాక్టర్ వద్దకు వెళ్తే.. రెస్ట్ తీసుకోమని చెప్పాడట. అయినా కూడా షూటింగ్ చేశాడట. నిలబడే డైలాగ్స్ చెప్పాడట