మెగా హీరోకి ఫాన్స్ రిక్వెస్ట్

అదేంటో తెలియదు గాని సినిమా వాళ్లంటే మనందరికీ ఎంతో క్రేజ్ ,వాళ్ళు ఎలా వున్నా మనము వాళ్ళని అనుసరిస్తూవుంటాం ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం అవ్వగానే ప్రతి ఒక్క మెగా ఫ్యాన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.శంకర్ దర్శకత్వంలో స్క్రీన్ మీద రామ్ చరణ్ ప్రెజంటేషన్ ని చూడాలని మూవీ  రిలీజ్ కోసం ఎదురు చూస్తు ఉన్నారు. అలాగే షూటింగ్ కూడా త్వరగా కంప్లీట్ చేసుకోవాలని తమ తమ ఇష్ట దైవాలని ప్రార్థిస్తున్నారు.కానీ వాళ్ళ కోరిక ఇప్పుడప్పుడే తీరేలా కనిపించటం లేదు.

గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి సంవత్సరంన్నర పైనే అవుతుంది. ఈ  సంవత్సరంన్నరలో ఎన్నో సార్లు షూటింగ్ పోస్ట్ పోన్ అవుతు వస్తుంది. మొన్న దీపావళి కి కూడా ఒక సాంగ్ రిలీజ్ చేస్తామని  ప్రకటించిన మేకర్స్ సాంకేతిక కారణాల వల్ల అది కూడా చెయ్యలేక పోయారు. ఇప్పుడు మూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అయ్యేది అనే అప్ డేట్ ని కూడా చిత్ర యూనిట్ ఇవ్వడం లేదు. దీంతో చరణ్ అభిమానులు చాలా డల్ గా ఉన్నారు. చరణ్ అయినా కల్పించుకొని మూవీ అప్ డేట్స్ బయటికి వచ్చేలా చూడాలని  అభిమానులు కోరుకుంటున్నారు.కాగా ఇండస్ట్రీ వర్గాల్లో వచ్చే నెల ఫిబ్రవరి కి గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంటాడనే మాటలు వినిపిస్తున్నాయి.పొలిటికల్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే టాక్ అయితే బయట చాలా బలంగా వినపడుతుంది.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత  దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .కియారా అద్వానీ చరణ్ కి జోడిగా నటిస్తుంది.