రాంచరణ్ సినిమాలో నటించే అవకాశం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమాని 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రకటనతోనే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశముంది.చరణ్ తన 15వ సినిమా 'గేమ్ ఛేంజర్'ని శంకర్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. అయితే 'ఇండియన్-2' కారణంగా 'గేమ్ ఛేంజర్' షూటింగ్ బాగా ఆలస్యమవుతుండటంతో.. 'RC 16' షూట్ ని ప్రారంభించాలని చరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మేకర్స్ నటీనటులను ఎంపిక చేసే పని మొదలుపెట్టారు. అంతేకాదు నూతన నటీనటుల కోసం తాజాగా ఆడిషన్ కాల్ కూడా ఇచ్చారు. ఉత్తరాంధ్ర యాస మాట్లాడే అన్ని వయసుల వారు నిమిషం నిడివిగల యాక్టింగ్ వీడియో పంపి, తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు అని తెలుపుతూ ఒక పోస్టర్ ను వదిలారు.