రజనికాంత్ కి కేకే న్యూస్ పుట్టినరోజు శుభాకంక్షాలు

రజనీకాంత్ ఈ పేరు చెబితే కుర్రకారు కి ,స్టైల్ కి ఒక అంబాసిడర్ ,అయినా రజని చాలా నిరాడంబరంగా కనిపిస్తారు ఈరోజు రజని బర్త్ డే 1950 డిసెంబర్ 12న జన్మించిన రజినీకాంత్ నేడు 73వ ఏట అడుగుపెట్టారు. వరల్డ్ వైడ్ ఆయన అభిమానులు రజినీకాంత్ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఏడు పదుల వయసులో కూడా రజినీకాంత్ వరుస చిత్రాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రజినీకాంత్ 168 చిత్రాలు చేశారు. మరో మూడు సినిమాలు లైన్లో పెట్టారు. రజినీకాంత్ ఇండియాలోనే అతిపెద్ద హీరో. ఒక్కో సినిమాకు వంద కోట్లు తీసుకుంటారు. తన సంపాదనలో రజినీకాంత్ యాభై శాతం వరకు ఛారిటీకి ఖర్చు చేస్తారు.అయినా కూడా రజినీకాంత్ వందల కోట్ల ఆస్తి కలిగి ఉన్నారు. రజినీకాంత్ ఆస్తుల వివరాలు పరిశీలిస్తే… ఆయనకు చెన్నై నగరంలోని పోయెస్ గార్డెన్ ఏరియాలో బంగ్లా ఉంది. అక్కడే రజినీకాంత్ నివాసం ఉంటున్నారు. 2002లో ఈ ఇంటిని నిర్మించినట్లు సమాచారం. ఈ బంగ్లా ధర రూ. 35 కోట్లు అని అంచనా. అలాగే రజినీకాంత్ కి రాఘవేంద్ర మండపం అనే ఫంక్షన్ హాల్ ఉంది. ఈ ప్రాపర్టీ ధర రూ. 20 కోట్లని అంచనా.

రజినీకాంత్ కార్ గ్యారేజ్ లో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. రూ. 6 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ హోస్ట్, రూ.16 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ రజినీకాంత్ వద్ద ఉన్నాయి. అలాగే హోండా సివిక్, ప్రీమియర్ పద్మిని, టయోటా ఇన్నోవా కార్లు రజినీకాంత్ వివిధ సందర్భాల్లో కొన్నారు. జైలర్ మూవీ నిర్మాత ఇటీవల ఆయనకు ఓ లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చారు.

 

వీటితో పాటు రూ.1.77 కోట్ల విలువ చేసే బీఎండబ్ల్యూ X 5, రూ.2.55 కోట్ల విలువ చేసే మెర్సిడెజ్ బెంజ్ జి వ్యాగన్, 3.10 కోట్ల విలువైన లాంబోర్గిని కార్లు రజినీకాంత్ వద్ద ఉన్నాయి. బెంట్లీ లిమోసిన్ ని కూడా రజనీకాంత్ వద్ద ఉంది. దీని ధర రూ .6 కోట్లు కాగా రజినీకాంత్ అభిరుచికి తగ్గట్లు దాన్ని డిజైన్ చేశారట. ఆ కారణంగా ఆ కారు ధర రూ.22 కోట్లు అట. మొత్తంగా రజినీకాంత్ ఆస్తుల విలువ రూ. 430 కోట్లు అని ఒక అంచనా..కానీ ఇవన్నీ రజనికి గర్వాన్ని పెంచలేక పోయాయి.