రఫ్ ఆడిస్తున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఈపేరు చెబితే చిన్న పిల్లడు దగ్గరనుండి ,పెద్దవాళ్ళ వరకు చాల మంది అభిమానులు వుంటారు అందులోను 90 వదశకంలో వచ్చిన సినిమాలు అప్పటి యువతని ఎంతగానో ఆకట్టుకున్నాయి ,ఇప్పుడు  నటిస్తున్న 156 వ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. కొన్ని రోజుల క్రితం నుంచే చిరు కూడా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సోషియో ఫాంటసీ గా తెరకెత్తున్న ఈ మూవీతో చిరంజీవి మొట్టమొదటి సారిగా  ఐదుగురు భామలతో జత కట్టబోతున్నాడు. ఈమూవీలో చిరంజీవి లుక్ ఎలా వుండబోతుందనే దాని మీద చిరు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను చిన్నపాటి  ఆసక్తి అయితే నెలకొని ఉంది. ఇలాంటి టైం లో చిరంజీవి కి సంబంధించిన పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.తాజాగా చిరంజీవి తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ ని చేంజ్ చేసారు. చేంజ్ చేసిన ఆ పిక్ లో చిరు లైట్ ఖాకీ కలర్ షర్ట్ తో  ట్రెండీ హెయిర్ స్టైల్ అండ్ కళ్ళకి  బ్లాక్ కలర్ స్పెక్ట్స్ ని ధరించిన పిక్ అయితే అదిరింది .మరి ముఖ్యంగా ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న చిరంజీవిని చూస్తున్నట్టుగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పిక్ చిరంజీవి నయా మూవీలో చిరు లుక్ ఇదే అని మెగా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోతున్నారు.అలాగే  ఆ పిక్ ని సోషల్ మీడియాలో మరింతగా షేర్ చేస్తున్నారు.బింబిసార మూవీతో భారీ హిట్ ని అందుకున్నవశిష్ట మల్లిడి దర్శత్వంలో తెరకెక్కతున్న ఈ మూవీని హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. విశ్వంభర అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రంలో  తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన అతిరధ మహారధులందరు నటిస్తున్నారు. చోటాకే నాయుడు ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ బాధ్యతలని నిర్వహిస్తున్నాడు.