టైగర్ త్రీ మూవీ రివ్యూ ... ?

 సినిమా అంటే తేడా లేకుండా ప్రతి ఆడియన్ కూడా ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న ప్రతి సినిమాని చూస్తున్నాడు.ఇక అందులో భాగంగానే దీపావళి క్రకార్ లా వెలగడానికి లక్ష్మి బాంబ్ లా పేలాడానికి సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన టైగర్ త్రీ సినిమా మన ముందుకు వచ్చింది.ఇక సల్మాన్ ఖాన్ ఇంతకుముందు తను చేసిన సినిమాల రేంజ్ ని దాటి ఈ సినిమా సక్సెస్ సాధించిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలాసిస్ ద్వారా తెలుసుకుంకథసల్మాన్ ఖాన్ ఇంతకుముందు తను చేసిన సినిమాల రేంజ్ ని దాటి ఈ సినిమా సక్సెస్ సాధించిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలాసిస్ ద్వారా తెలుసుకుందాం.

ముందుగా ఈ సినిమా కథలోకి వెళ్తే టైగర్ (సల్మాన్ ఖాన్) అనే ఒక వ్యక్తి రష్యాలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని కాపాడడానికి రష్యా వెళ్లి అక్కడ ఒక ఒక ఉద్యోగంలో చేరుతాడు. ఆ ఇంపార్టెంట్ పర్సన్ ని చంపడానికి జోయ (కత్రినా కైఫ్) తిరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటి ప్రాసెస్ లోనే ఆ వ్యక్తిని కాపాడిన టైగర్ జోయతో మాట్లాడి కొన్ని విషయాలను తెలుసుకుంటాడు. అందులో ముఖ్యంగా ఐఎస్ఐ తీవ్రవాదులు చేస్తున్న కుట్రకు సంబంధించిన విషయాలను తెలుసుకొని టైగర్ జోయా ఇద్దరు కలిసి వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తారు. ఇక అందులో భాగంగానే టైగర్ జోయ ఇద్దరూ కూడా ఉగ్రవాదులు గా గుర్తించబడతారు అలా వాళ్ల మీద పడ్డ అపవాదిని చెరిపేసుకున్నరా,లేదా ఇక వాళ్లు ఆ ద్రోహులను పట్టుకొని ఇండియాని వాళ్ల భారీ నుంచి ఎలా కాపాడారా లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

 

అనాలసిస్

ఇక ఒకసారి ఈ సినిమా గురించి అనాలసిస్ చేసుకుంటే ముందుగా ఈ కథ గురించి తీసుకుంటే గత రెండు చిత్రాలతో పోల్చుకుంటే టైగర్ త్రీ అనేది పెద్దగా ఇంపాక్ట్ ఉన్న కథ అయితే కాదు. ఇంతకు ముందు మనం చూసిన చాలా కథలని బేస్ చేసుకొని తీసిన ఒక రొట్ట కథ తప్ప పెద్ద కొత్త కథ అయితే ఈ సినిమాలో ఏమీ లేదు. ఇక ఇలాంటి క్రమంలో దర్శకుడు మనీష్ శర్మ స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా డైరెక్షన్ మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తుంది. కొన్ని షాట్స్ మాత్రం అద్భుతంగా తెరకెక్కించాడు ఆ విషయం లో మనిష్ ని మెచ్చుకోవచ్చు… యాక్షన్ పార్ట్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి అయితే ఇవన్నీ ఉన్న కూడా సినిమా అంటే ముఖ్యంగా కథ ఉండాలి అది కూడా చాలా ఫ్రెష్ గా ఉండాలి కానీ ఈ సినిమా ఆ కథ చాలా డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఒక భారీ రేంజ్ లో సినిమా తీసినప్పుడు దానికి సంబంధించిన కథ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొవాలి ఒకటికి పది సార్లు కథ మీద ఫోకస్ పెట్టాలి…అల చేస్తేనే కథ లో క్వాలిటీ ఉంటుంది. ఇక యశ్ రాజ్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఇంతకుముందు షారుక్ ఖాన్ తో చేసిన పఠాన్ సినిమా సూపర్ సక్సెస్ అయింది.ఇక దాని తర్వాత సల్మాన్ ఖాన్ తో చేస్తున్న ఈ సినిమా మీద ప్రొడక్షన్ పరంగా వీళ్ళు బాగా ఖర్చు పెట్టారు అలాగే ఈ సినిమా మీద కూడా వాళ్ళు భారీ అంచనాలను పెట్టుకున్నారు కానీ ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో మాత్రం చాలా వరకు డిసాపాయింట్ చేసిందనే చెప్పాలి…ముఖ్యంగా సినిమా డ్రాబ్యాక్స్ ని గనుక డైరెక్టర్ ముందే రెక్టిఫై చేసి ఇంకొంచెం సినిమాల్లో క్యారెక్టర్ల ఇన్వాల్వ్ మెంట్ పెంచుంటే బాగుండేది అలాగే ఇక ఐ ఎస్ ఐ తీవ్రవాదుల గురించి ఆయన చూపించిన విధానం కూడా పెద్దగా ఎఫెక్టివ్ గా అనిపించదు…డైరెక్టర్ మనీష్ శర్మ ఇంతకుముందు తీసిన బ్యాండ్ బాజా భారత్ తన కెరీర్ లోనే ఒక మంచి సినిమాగా నిలిచిపోయింది. ఇక అలాంటి తరహాలోని ఈ సినిమా కూడా ఒక భారీ హిట్ గా నిలుస్తుంది అని చాలామంది అనుకున్నారు.కానీ దర్శకుడు సినిమాని స్టార్ట్ చేసిన మొదటి 10 నిమిషాల నుంచే మనకు బోర్ కొట్టేస్తుంది.ఇక ఎలాగో అలాగా ఫస్ట్ హాఫ్ నెట్టుకొచ్చినప్పటికి సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి స్టోరీ అనేది అవుట్ ఆఫ్ ది ట్రాక్ వెళ్లిపోయింది. దాంతో దర్శకుడు సెకండ్ హాఫ్ ని ఎలా నడిపించాలో తెలియక నచ్చిన ట్రాక్ లో తీసికెళ్ళి పోయాడు తప్ప ఒక స్పై థ్రిల్లర్ లాగా మాత్రం సినిమాని ఎంగెజింగ్ గా ఎక్కడ తీసుకెళ్లలేదు…ఇక ఈ సినిమాలో ఆ టవల్ ఫైట్ మాత్రం అద్భుతంగా చిత్రీకరించారనే చెప్పాలి… ఆ ఫైట్ వచ్చినప్పుడు మాత్రమే ఆడియెన్స్ విజిల్స్ వేశారు అంటే ఆ ఫైట్ ప్రేక్షకుడిలో ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు…ఇక SRK చిన్న కమియో రోల్ థియేటర్ లో అద్బుతం గా పేలింది…

 

ఆర్టిస్ట్స్ పర్ఫామెన్స్…

 

ఇక ఆర్టిస్ట్ లా పర్ఫామెన్స్ విషయానికొస్తే సల్మాన్ ఖాన్ తన క్యారెక్టర్ లో ఏదో నటించాను అంటే నటించాడు తప్ప ఇంతకు ముందులా ఆయన ఒక క్యారెక్టర్ లో ఉండే డెప్త్ ని ఇవ్వలేకపొతున్నాడు. ఒకప్పుడు సళ్ళు భాయ్ అంటే రిస్కీ షాట్స్ చేస్తూ క్యారెక్టర్ ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువగా ఉండేది ఈ సినిమాలో అది తగ్గింది…ఇక కత్రినా కైఫ్ ఇంతకుముందు చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కొంచం బెటర్ ఆమె కి పర్ఫామ్ చేయడానికి కొంచం స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది తను కూడా కొంతవరకు ఆ పాత్రలో మెప్పించింది…ఇక ఇమ్రాన్ హష్మీ తన క్యారెక్టర్ లో ఒదిగిపోయి ఎక్కడ కూడా ఆ క్యారెక్టర్ తాలూకు ఇంటెన్స్ ని తగ్గించకుండా క్యారెక్టర్ నుంచి బయటకి వెళ్లకుండా ఆ క్యారెక్టర్ కి ఎంత కావాలో లిమిటేషన్స్ ని ఫాలో అవుతూనే నటించి మెప్పించాడు. అలాగే ఒక క్యారెక్టర్ లో నటించిన రేవతి కూడా ఆమె పాత్రలో సెటిల్డ్ గా నటించి మెప్పించింది…ఇక మిగతా క్యారెక్టర్లన్ని కూడా ఉన్నాయి అంటే ఉన్నాయి అంతే తప్ప పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేదు…

 

ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా టెక్నికల్ విషయానికి వస్తే డిఓపి అనయ్ గొసామి ఆయన చూపించిన విజువల్స్ లో మాత్రం చాలా గ్రాండ్ ఇయర్ కనిపించింది. ప్రతి షాట్ కూడా ప్రాపర్ గా డిజైన్ చేస్తూ చాలా రిచ్ గా ఉండే విధంగా ప్లాన్ చేశాడు…

ఇక మ్యూజిక్ విషయానికొస్తే ప్రీతం, తనుజ్ టిక్కు అనే ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు తమదైన రీతిలో మ్యూజిక్ అందించినప్పటికీ ఆ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఎలివేషన్స్ కి తగ్గట్టు బిజిఎం అయితే పడలేదు దానివల్ల కొన్ని ఎలివేషన్ సీన్స్ ఎలివేట్ అవ్వలేదు… ఎలివేట్ అయి ఉంటే ఇంకో రేంజ్ లో ఉండేది. కాబట్టి మ్యూజిక్ అనేది సినిమాకి బిగ్ మైనస్ గా మారింది.. 

ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ వచ్చేసి 3.5/5