ఇంటర్ ఫలితాలు ఎప్పుడో తెలుసా ?
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫలితాలు వెల్లడించడానికి రెడీ అవుతోంది ఇంటర్మీడియట్ బోర్డు. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు దాదాపు 10 లక్షలకు పైగా విద్యార్థులు హాజరు కాగా.. వారంతా కూడా ఫలితాల కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తయిందని సమాచారం. మూల్యాంకన ప్రక్రియను పునఃపరిశీలన చేసేందుకు మరో వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉంది.ఏప్రిల్ 7వ తేదీ నాటికి మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు.. ప్రస్తుతం ఫలితాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్కులను డిజిటల్ గా నమోదు చేసి ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసి ఫలితాలను విడుదల చేయాలని బోర్డు భావిస్తోంది. అయితే ఇదంతా పూర్తి కావడానికి మరో వారం రోజుల సమయం పట్టవచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15వ తేదీ నాటికి ఇంటర్ ఫలితాలు వెలువరించేందుకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది.
Comments
0 comment