మేనిఫెస్టో విడుదలపై పార్టీలు ఎందుకు ఈ కిరి కిరి ? కారణం అదేనా?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమీపిస్తున్న వేళా  మేనిఫెస్టో విడుదలపై అన్నీ రాజకీయ పార్టీలు వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే ప్రకటించాల్సిన వరాలు ఇంతవరకు ఏ పార్టీ ముందుకు తీసుకురాలేదు. దీంతో వరాల జల్లులు కోసం ప్రజలు ఎదురుచూస్తు ఉన్నారు. రేపు మాపు  అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఎవరూ కూడా ఖచ్చితంగా మేనిఫెస్టో గురించి చెప్పడం లేదు. మేనిఫెస్టో ను ముందు ఏ పార్టీ అయినా సరే  ప్రకటిస్తే, హామీల వరాలతో ప్రజల్లోకి వెళ్లి ఓట్లను కొల్లగొట్టాలని ఆలోచనలతో పార్టీలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.2019 ఎన్నికల్లో టిడిపి, వైసీపీ ఐదు రోజులు ముందుగా మాత్రమే మేనిఫెస్టో ను విడుదల చేసాయి. ఇప్పుడు కూడా అదే బాటలో ఉన్నారో తెలియడం లేదు.ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలపై అన్నీ పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఎన్నికల వాగ్ధానాలు, హామీల రూపంలో ప్రజలు తమను గెలిపిస్తే ఐదేళ్లలో ఏం చేస్తామో చెప్పే ఎన్నికల మేనిఫెస్టోను మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు ఏ పార్టీ. అదే గత ఎన్నికల్లో ఒకేరోజు రెండు పార్టీలు మేనిఫెస్టోను ప్రకటించాయి. మీ భవిష్యత్తు నా బాధ్యత పేరుతో టిడిపి, నేను విన్నాను, నేను ఉన్నాను పేరుతో వైసిపి మేనిఫెస్టో ప్రకటించాయి. అయితే రెండు మేనిఫెస్టోలో ఒకే విధమైన హామీలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న 2000 ఫెక్షన్ 3000 వేలకు పెంచుతామని రెండు పార్టీలు హామీ ఇచ్చాయి. వీటితో పాటు ప్రతి సంవత్సరం ఉద్యోగాలు, వడ్డీలేని రుణాలు, వ్యవసాయానికి పగటిపూట ఉచిత విద్యుత్, వంటి హామీలను ఇచ్చారు.. టిడిపి కంటే వైసీపీ హామీలు మంచిగా ఉండటంతో  ప్రజలు వైసీపీకే బ్రహ్మరథం పట్టారు.ప్రస్తుతం హామీలు విషయంలో  ప్రధాన ప్రతిపక్షంగా టిడిపి కాస్త ముందడుగు వేసింది. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో సూపర్ సిక్స్ పథకాల మేనిఫెస్టోను ఆపార్టీ విడుదల చేసింది. పోయిన సంవత్సరం  రాజమండ్రిలో జరిగిన మహానాడులో అధినేత చంద్రబాబు ఈ సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లో వెలువరించారు. ఈపధకాలు గతంలో జగన్ ప్రకటించిన నవరత్నాలు  రెండు కూడా ఇంచుమించుగా  ఒకే విధంగా ఉన్నాయి. అమ్మబడికి బదులుగా తల్లికి వందనం,  వైయస్సార్ చేయూత పథకానికి బదులుగా శ్రీనిధి పథకం టిడిపి ప్రకటించింది. అయితే అమ్మబడి పధకంలో ఒక్కరికి మాత్రమే పర్తింపజేశారు..కానీ తల్లికి వందనం మాత్రం ఇంట్లో ఉన్న చదువుకున్న పిల్లలందరికీ వర్తింప చేస్తానని టిడిపి ప్రకటించింది. అంతేకాకుండా మహిళలకు నెలకు 1500 అలాగే ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీలను ఇచ్చింది. ఆ మేనిఫెస్టోను దసరాకు విడుదల చేస్తానని చంద్రబాబు నాయుడు అన్నారు. కాని అరెస్ట్ కారణంగా ఆ సమయంలో ఆయన విడుదల చేయలేకపోయారు.స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు అవ్వడం, రాజమండ్రి జైలుకు తీసుకువెళ్లడం జరిగిపోయాయి. ఆ సమయంలో జనసేన పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తు విషయంమై ప్రకటన చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి సంక్రాంతి నాటికి మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్లన అది కూడా ఆగిపోయింది.  అయితే టీడీపీ, జనసేనతో బిజెపితో పొత్తు పెట్టుకోవడంతో మళ్లీ హమీలు వాయిదా పడ్డాయి. ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరడంతో గత నెల 17న చిలకలూరిపేటలో  మూడు పార్టీలు కలసి ఉమ్మడి సభను నిర్వహించారు. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు కలసి చర్చించుకొని హామీలు ఇస్తాయి. వీటిని ఎప్పుడు విడుదల చేస్తారో అని  ప్రజలలో సర్వత్రా నెలకొంది. 2019 ఎన్నికలకు ముందు నవరత్నాలు పేరుతో వైసిపి కొన్ని హామీలను ప్రకటించింది. అసలు పార్టీలు  కొత్త మేనిఫెస్టోలో నూతన అంశాలు ఏముంటాయని ఆపార్టీ కార్యకర్తలు రాజకీయాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేక వైసిపి, టిడిపి రెండు కూడా ఒక విధమైన హామీలు ఇస్తారో వేచి చూడాలి.