బ్రదర్ అనీల్ సంచలన నిజాలు ?

ఆంధ్ర రాజకీయాలు అన్ని రాజశేఖర్ రెడ్డి కుటుంభం చుట్టూ తిరుగుతోంది. ఆయన కుమారుడు సీఎం జగన్ ఒకవైపు, రాజకీయ ప్రత్యర్థులు మరోవైపు ఉండగా.. వైయస్ షర్మిల మెరుపులు మెరిపిస్తున్నారు. సోదరుడు జగన్ ని టార్గెట్ చేసుకున్నారు.దీంతో జగన్,షర్మిల మధ్య పెద్ద అంతరం ఏర్పడింది. పెద్ద యుద్ధమే నడుస్తోంది. వారి మధ్య చిన్న పాటి మాటలను సైతం భూతద్దంలో పెడుతున్నారు. ముఖ్యంగా ఎల్లో మీడియా ఆ కుటుంబ రాజకీయాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది. పతాక శీర్షికన కథనాలు రాస్తోంది. తాజాగా బ్రదర్ అనిల్ కుమార్ కడపలో ఓ చర్చిలో రాజకీయ ప్రసంగం చేసినట్లు రాసుకొచ్చింది. పాపులను శిక్షించాలి అంటూ బ్రదర్ అనిల్ కుమార్ ప్రార్థనలు చేసినట్లు ఎల్లో మీడియాలో వచ్చింది.బ్రదర్ అనిల్ కుమార్ మత ప్రబోధకుడు. వైయస్ షర్మిల భర్త. 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పేరు తరచూ వినిపించింది. అటు జగన్ పార్టీ పెట్టినప్పుడు, విపక్షంలో ఉన్నప్పుడు ఆయన కోసం బ్రదర్ అనిల్ కుమార్ మత రాజకీయాలు చేశారన్న విమర్శ ఉంది. ఇప్పుడు సోదరుడు జగన్ ను షర్మిల రాజకీయంగా విభేదించడం వెనుక బ్రదర్ అనిల్ కుమార్ పాత్ర ఉందని ప్రచారం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా సోదరుడిపై గట్టి పోరాటమే చేస్తున్నారు. ఈ క్రమంలో ఎల్లో మీడియాలో షర్మిల తో పాటు కుటుంబంలోని జగన్ వ్యతిరేకులకు ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. అందులో భాగంగా షర్మిల కాంగ్రెస్ లోకి ఎంట్రీ తో జగన్ కు దారుణంగా దెబ్బ తప్పదనిఎల్లో మీడియా కథనాలు రాసుకోస్తోంది. తాజాగా బ్రదర్ అనిల్ కుమార్ పులివెందులలో ఓ చర్చిలో మత ప్రసంగం చేశారని.. పాపులను యేసు శిక్షిస్తాడంటూ వ్యాఖ్యలు చేశారని ఆ సెక్షన్ ఆఫ్ మీడియాలో వచ్చింది.అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉండగా ఒక చర్చిలో బ్రదర్ అనిల్ కుమార్ రాజకీయ ప్రసంగం చేశారని తెలియడం సంచలనం గా మారింది. అయితే దీనిపై తాజాగా బ్రదర్ అనిల్ కుమార్ స్పందించారు. తాను రాజకీయ ప్రసంగం చేయలేదని తేల్చి చెప్పారు. కేవలం తాను పాములను, తేళ్లను శిక్షించాలని మాత్రమే అన్నానని.. అది బైబిల్లో ఉందని.. దానిని పాపులు అంటూ చిత్రీకరించారని ఆయన చెబుతున్నారు. తన ప్రార్ధనల వల్లే రాజశేఖర్ రెడ్డి, జగన్లు గెలిచారని తాను ఎన్నడూ అనలేదని.. అది అవాస్తవంగా పేర్కొన్నారు. తాను మత ప్రబోధకుడిని మాత్రమేనని.. మతం పేరిట రాజకీయాలు చేయనని కూడా తేల్చి చెప్పారు. గతంలో కూడా ఇటువంటి పనులు చేయలేదని.. భవిష్యత్తులో కూడా అటువంటివి చేయనని బ్రదర్ అనిల్ కుమార్ చెప్పడం సంచలనం గా మారింది. ప్రస్తుతం బ్రదర్ అనిల్ కుమార్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.