అపచారం ..అపచారం..! తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు నూనెలు ?
కలియుగ వైకుంఠం గా తిరుమలను ప్రతి హిందువు భావిస్తారు ,ఎక్కడైనా అబద్దం ఆడవచ్చేమో కానీ వెంకన్న విషయం లో ఆడితే వెంకన్న క్షమించడు అని హిందువులు నమ్మకం , ఎన్నో ప్రభుత్వాలు వచాయి వెళ్లాయి కానీ తిరుమలను ,అక్కడ వాతావరణాన్ని కల్మషం చేసే సాహసం ఏ ప్రభుత్వం చెయ్యలేదు కానీ వైసీపీ ప్రభుత్వం ఆగమ శాస్త్రాన్ని ,అక్కడ భక్తి వాతావరణాన్ని జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు ఎంత భంగం కలిగించాలో అంతా కలిగించారు. తిరుమల కొండపై పారిశుద్ధ్యం నుంచి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా నాశనం చేశారు. తిరుమలలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారు. అన్యమత ప్రచారం నుంచి జగన్ హయాంలో తిరుమలలో జరగని అపచారం లేదు. తేలిపోయింది. జగన్మోహన్ రెడ్డి, హిందూ ధర్మ వ్యతిరేకి అయినా కాకున్నా, హిందువు అయితే కాదు. ఇది జగమెరిగిన సత్యం.
అయితే జగన్ అధికారంలో ఉన్న సమయంలో తిరుమల కొండ వేదికగా జరిగిన పరిణామాలు గమనిస్తే ఆయన హిందూ ధర్మ వ్యతిరేకి అనేందుకు సందేహించవలసిన అవసరం లేదు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో హిందూధర్మంపై ఒక విధంగా దాడి జరిగిందని చెప్పవచ్చు. ఆయన అధికారంలో ఉన్న కాలంలో ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగాయి. , ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి. చివరకు ఏడుకొండల వెంకన్నదేవుని సన్నిధిలో అన్యమత ప్రచారం జరిగింది. ఏడుకొందలపై ఆగమ శాస్త్ర విరుద్ధంగా డ్రోన్లు సంచరించాయి. టీటీడీ నియామకాలలో అన్యమతస్తులకు రిజర్వేషన్ కల్పిస్తూ టీటీడీ నిర్ణయం వరకూ జగన్ అధికారంలో ఉండగా దేవదేవునివిషయంలో జరగని అపచారం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానం జగన్ అధికారంలో ఉన్న కాలంలో ధర్మ విరుద్ధ చర్యలకు నిలయంగా మారింది. , హిందూ ధర్మ సంస్థలు ఈ విషయాన్ని అప్పట్లో పదే పదే చెప్పాయి. ఆరోపించాయి. ఫిర్యాదులు చేశాయి. ఆవేదన వ్యక్తం చేశాయి.ప్రసాదం ధర మొదలు వసతి గదుల అద్దెల వరకూ దొరికినంత దోచుకో పద్దతిలో అప్పట్లో టీటీడీ దోపిడీకి పాల్పడిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఆర్జిత సేవల విషయం అయితే చెప్పనే అక్కర లేదు. భక్తులకు సమకూరుస్తున్న సదుపాయాలు నిర్వహణ అత్యంత అధ్వానంగా ఉండేది. స్వామి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో గంటలు తరబడి నిరీక్షించే భక్తుల ఆకలి దప్పికలు తీర్చేందుకు సమయానుకూలంగా జరిగే ప్రసాద వితరణ బంద్ అయిపోయింది. చివరికి జల ప్రసాదం కూడా అందుబాటులో ఉండేది కాదు. క్యూ కాంప్లెక్స్ లో పారిశుధ్యం ఆనవాలే కనిపించేది కాదు దుర్వాసనలు భరిస్తూ భక్తులు స్వామి దర్శనానికి నిరీక్షించ వలసి వచ్చేది. గోవింద నామ స్మరణ తప్ప మరో పేరు వినిపించడమే అపచారంగా భావించే తిరుమల కొండపైన ఏకంగా రాజకీయ జెండాలు, స్టిక్కర్లు దర్శనం ఇచ్చాయి. ఇవన్నీ అందరికీ తెలిసిన అందరికీ కనిపించిన విషయాలు.
కానీ అంతకు మించిన అపచారాలు కూడా జగన్ హయాంలో తిరుమల కొండపై జరిగాయని ఇప్పుడు వెలుగోలోకి వచ్చింది. అడ్డూ ప్రసాదం కూడా అపవిత్రం చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా తిరుపతి లడ్డూ ప్రసాదం నాణ్యత నాసిరకంగా తరాయైందని భక్తులు పెద్ద ఎత్తున ఆఱోపణలు గుప్పించాయి. అందుకు కారణమేంటో ఇప్పుడు బయట పడింది. స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడాల్సిన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం వాడింది. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి సమావేశంలో చెప్పారు. జగన్ హాయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ వాడితే.. తాము అధికారంలోకి రాగానే అన్నీ నాణ్యమైన పదార్థాలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. తిరుమలలో గత ఐదేళ్ల కాలంలో అత్యంత ఘోరమైన పనితీరు ఉండేది. ఆధ్యాత్మిక వాతావరణం అసలు కనిపించేదే కాదు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. టిటిడి పై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఈ సంచలన విషయం బయటకు వచ్చింది. అందుకే దిద్దుబాటు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. స్వచ్ఛమైన నెయ్యిని తప్పించి లడ్డు ప్రసాదం కోసం వాడుతోంది. అయితే చంద్రబాబు రాజకీయ విమర్శలు చేయడం సర్వసాధారణం.. కానీ ఎంతో పవిత్రంగా భావించే టీటీడీ విషయంలో విమర్శలు చేయరు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఎంతో కొంత నిజం లేకుంటే ఆయన ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు అన్నది చర్చకు దారితీస్తోంది. టీటీడీ విషయంలో ఇప్పటికీ జగన్ సర్కార్ పై విమర్శలు ఉన్నాయి. ఇవి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఇటువంటి సమయంలోనే చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం.
వాస్తవానికి టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత.. టీటీడీలో ప్రక్షాళన ప్రారంభమైంది. ఈవో ధర్మారెడ్డి పై వేటు వేశారు. సమర్థ అధికారిగా పేరు తెచ్చుకున్న శ్యామలరావును నియమించారు. దీంతో గాయన సీరియస్ యాక్షన్ కు దిగారు. తిరుమలలో అవినీతిని అరికట్టేలా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తిరుమల పవిత్రతను కాపాడేలా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తప్పిదాలు గుర్తించి వెనువెంటనే చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే లడ్డు తయారీలో జంతువులు కొవ్వు నూనెను వాడుతుండడం వెలుగు చూసినట్లు తెలుస్తోంది. దీనిపై మున్ముందు మరింత వివాదం రగిలే అవకాశం ఉంది..
Comments
0 comment