ఏపీ ప్రజలకు తీపి కబురు చెప్పిన వాతావరణ శాఖ

ఏపీకి వాతావరణశాఖ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వడగాలుల తీవ్రత ఆదివారం కొంతమేర తగ్గింది. తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాలో తేలికపాటి జల్లులు పడే అవకాశముంది.ఆదివారం 36 మండలాల్లో తీవ్ర వడగాలులు, 82 మండలాల్లో వడగాలులు వీచాయి. రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.5, తిరుపతి జిల్లా రేణిగుంటలో 45.4, ప్రకాశం జిల్లా దరిమడుగులో 44.8, అనంతపురం జిల్లా తరిమెలలో 44.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం 26 మండలాల్లో తీవ్ర వడగాలులు, 64 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. అలాగే మంగళవారం 46 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 88 మండలాల్లో వడగాడ్పులు వీయొచ్చని చెబుతున్నారుఅలాగే ఆదివారం ప్రకాశం జిల్లా దరిమడుగులో 44.8, అనంతపురం జిల్లా తరిమెలలో 44.2, కడప జిల్లా బలపనూరు, అనకాపల్లి జిల్లా రావికమతం, పల్నాడు జిల్లా రావిపాడులో 43.8, నెల్లూరు జిల్లా కసుమూరులో 43.7, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో 43.6, విజయనగరం జిల్లా ధర్మవరంలో 43.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 36 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 82 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని కూర్మనాథ్‌ కోరారు. వృద్దులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు