జె.డి లక్ష్మి నారాయణను చంపాలని చూసింది ఎవరు ?

ఆంధ్రప్రదేశ్ లో  ఎన్నికల వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తనకు ప్రాణహాని ఉందంటూ సీబీఐ మాజీ జేడీ, జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మినారాయణ పోలీసులను ఆశ్రయించారు. విశాఖపట్నంలో తనను చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ విశాఖఫట్నం పోలీస్ కమిషనర్‌ను కలిసి శుక్రవారం ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని లక్ష్మినారాయణ పోలీసులను కోరారు. దీనికి సంబంధించి ఆధారాలను కూడా సమర్పించారు. లక్ష్మినారాయణ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

1301-entry-1-1714140314.jpg

పోలీసులకు ఫిర్యాదు చేసిన వచ్చిన అనంతరం మాట్లాడిన లక్ష్మినారాయణ.. పలు కీలక విషయాలు వెల్లడించారు. దేశాన్ని కుదిపేసిన కేసులను సీబీఐలో పనిచేసిన సమయంలో చూశానన్న లక్ష్మినారాయణ.. ఆ సమయంలో చాలా బెదిరింపులు వచ్చాయని చెప్పారు. అప్పట్లో ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని రక్తంతో కూడా కంప్లైంట్ లెటర్ రాశామని చెప్పారు. 2018 తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానన్న లక్ష్మినారాయణ.. ప్రస్తుత ఎన్నికల్లో విశాఖ ఉత్తరంలో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. అయితే పాత కేసుల్లో నిందితుల శిష్యులు తమ బాస్‌కు శిక్షపడేలా చేశానని నా మీద కక్ష కట్టారని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ చెప్పారు.