జగన్ కు సొంత ఫోన్ లేదా ? నమ్మొచ్చా ?

ఆంధ్రలో  జగన్ గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. విదేశాలకు వెళ్లేందుకు జగన్ కోర్టు అనుమతి కోరిన సంగతి తెలిసింది. దీనిపై న్యాయస్థానం ఈరోజు నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికల అనంతరం జగన్ కుటుంబసమేతంగా బ్రిటన్, స్విట్జర్లాండ్ వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది. ఎన్నికలు అవ్వగానే జగన్ విదేశాలకు వెళ్లడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ నేపథ్యంలో జగన్ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ప్రైవేట్ లైఫ్ గురించి కూడా మాట్లాడారు. అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.ఇటీవల జగన్ ఓ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. తనకు ఫోన్ లేదని.. తనకు కనీసం నెంబర్ కూడా లేదని చెప్పుకొచ్చారు. ఇంట్లో వారు నాతో మాట్లాడాలంటే పీఏలకు ఫోన్ చేసి మాట్లాడతారని చెప్పారు. నాకు ప్రైవేట్ లైఫ్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. నాకు పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ అంతా ఒక్కటే. ఇంట్లోకి రాగానే భార్యా పిల్లలతో సంతోషంగా గడుపుతా. వీలు కుదిరినప్పుడు సినిమాలు చూస్తా. అందరితో సత్సంబంధాలు ఉండాలని భావిస్తా. అంటూ సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇటీవల వైయస్ కుటుంబంలో జరిగిన పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. కుటుంబంలో అడ్డగోలు చీలిక వచ్చింది. ఈ నేపథ్యంలోనే తన ప్రైవేట్ లైఫ్ గురించి జగన్ మాట్లాడినట్లు తెలుస్తోంది.మరోవైపు ఎన్నికలు అవ్వగానే విదేశాలకు జగన్ వెళ్ళనున్నారు. అక్కడ చదువుకుంటున్న కుమార్తెలతో గడపనున్నారు. అయితే ఏటా వేసవి విడిదికి విదేశాలకు వెళ్లడం జగన్ కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఈసారి మాత్రం ఎన్నికలు జరగడం.. వెంటనే విదేశాలకు వెళ్తానని కోర్టుకు అనుమతి కోరడంతో.. ఇది చర్చకు దారి తీసింది. అందుకే కుటుంబ విలువల గురించి, ప్రైవేట్ లైఫ్ గురించి జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఉన్న ప్రస్తుత తరుణంలో.. తనకు ఫోన్ లేదని జగన్ చెబుతుండడం కొంచెం అతిగా అనిపిస్తోంది.