జగన్ ని ఉతికి ఆరేసిన మోడీ

ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాలలో పర్యాటన కు వచ్చి తొలుత రాజమండ్రి సభలో ప్రధాని మోదీ వైసీపీ సర్కార్ విధానాలను తప్పుపట్టారు. అనకాపల్లి సభలో మాత్రం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి బెల్లం అంతర్జాతీయ ఖ్యాతి పొందిందని.. అలాంటి తీయటి ప్రభుత్వమే ఏపీలో ఏర్పడనుందని చెప్పారు. జూన్ 4న వచ్చే ఫలితాలు ఇంతకన్నా తీయగా ఉంటాయని.. ఏపీలో కూటమి ప్రభుత్వమే ఏర్పడుతుందని మోడీ స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్ ఇచ్చేందుకు తాము రెడీగానే ఉన్నామని.. కానీ ఇక్కడి ప్రభుత్వమే భూమి ఇవ్వడం లేదని మోడీ విమర్శించారు. ఏపీలో అవినీతి తప్ప ఇంకేమీ కనిపించడం లేదని హాట్ కామెంట్స్ చేశారు. కేంద్రం ఏపీలో ఎంతో అభివృద్ధి చేస్తుంటే.. ఇక్కడున్న వైసీపీ మాత్రం ఎందుకు చేయడం లేదని ప్రధాని ప్రశ్నించారు.పోలవరం ప్రాజెక్టు పై సైతం ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టు కోసం కృషి చేశారని.. ఆయన కుమారుడు జగన్ మాత్రం ఏ పని చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం 15000 కోట్లుఇచ్చిందని.. ఆ నిధులు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. రైతుల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని ప్రధాని మోదీ తేల్చేయడం విశేషం.వైసీపీ తారక మంత్రం అవినీతి అవినీతి అవినీతి అంటూ.. ప్రధాని పదే పదే ప్రస్తావించటం గమనార్హం. చివరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పనులను సైతం రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ నిర్వాకం మూలంగానే అనకాపల్లి రైతులు చెరుకు పండించడం మానేశారని కూడా ఆరోపణలు చేశారు. ఏపీలో ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా కొనసాగుతోందని కూడా మోడీ ఆరోపించారు. కాంగ్రెస్, వైసిపి ఒక్కటేనని కూడా దుయ్యబట్టారు. మొత్తానికైతే అటు వైసీపీ సర్కార్ తో పాటు ఇటు జగన్ పై విమర్శలు చేయడంలో ప్రధాని ముందు వరుసలో నిలిచారు. అయితే గత ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ విషయంలో బిజెపి ఉదాసీనంగా వ్యవహరించింది. కానీ ఈ ఎన్నికలవేళ జగన్ ను ప్రధాని మోదీ టార్గెట్ చేసుకోవడం విశేషం.