ప్రచారానికి వచ్చిన సాయిధరమ్ తేజ్ పై హత్యాయాత్నం ?

మెగా హీరో సాయి ధరమ్ తేజ్  కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన మేనమామ పవన్ కళ్యాణ్  తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సాయి ధరమ్ తేజ్ పై.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బీరు సీసాలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో సాయి తేజ్ తృటితో తప్పించుకోగా.. ఆయన పక్కనే ఉన్న జనసేన కార్యకర్త శ్రీధర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో శ్రీధర్ ని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.కాగా, సాయి తేజ్ పై బీరు సీసాలు, రాళ్లతో దాడికి పాల్పడింది అధికార పార్టీ వైసీపీ వర్గీయులు అని ప్రచారం జరుగుతోంది. మెగా హీరో ప్రచారం నిర్వహిస్తున్న చోటుకి కొందరు వైసీపీ వర్గీయులు వచ్చి 'జై జగన్' నినాదాలతో ఈ దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు.సినీ పరిశ్రమలో సాయి ధరమ్ తేజ్ కి సౌమ్యుడు, వివాద రహితుడుగా పేరుంది. పైగా రోడ్డు ప్రమాదంలో చావు అంచుల వరకు వెళ్లి, ప్రాణాలతో బయటపడ్డాడు. అలాంటి వ్యక్తిపై ఇలా దాడులకు పాల్పడటం ఏంటంటూ జనసైనికులు, మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.