పవన్ అసెంబ్లీకి వెళ్లినా జరిగేది ఇదే..!

పవన్ కళ్యాణ్  పిఠాపురం నుండి పోటీ చేస్తున్నారు. హనుమాన్ జయంతి పర్వదినం ఏప్రిల్ 23న నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆయన ఆస్తులు, అప్పుల వివరాలు అఫిడవిట్ లో జోడించారు. దీంతో ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ మొత్తం రూ. 46.70 కోట్ల అప్పులు వెల్లడించారు.అయితే వీటిలో కొన్ని నేరుగా చేసిన అప్పులు కాదు. సినిమాలు చేసేందుకు నిర్మాతల నుండి తీసుకున్న అడ్వాన్స్. పవన్ కళ్యాణ్ పలు నిర్మాణ సంస్థలు, ప్రొడ్యూసర్స్ వద్ద అడ్వాన్సులు తీసుకున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, డివివి దానయ్య, నవీన్ ఎర్నేని, మైత్రీ మూవీ మేకర్స్ వద్ద కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నట్లు పొందుపరిచారు.డివివి దానయ్య నిర్మాతగా ఓజీ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్నారు. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తుండగా కొంత మేర షూటింగ్ జరుపుకుంది. ఓజీ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మిస్తున్నారు. హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సైతం మధ్యలో ఉంది. కాగా హారిక హాసిని క్రియేషన్స్ వద్ద పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ తీసుకున్నారు.కాబట్టి ఆ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. వీటితో పాటు హరి హర వీరుమల్లు సెట్స్ పై ఉంది. ఈ క్రమంలో ఓ వాదన తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచినా ఆయన సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ పూర్తి అయ్యే వరకు ఆయన బిజీగా ఉంటారని అంటున్నారు. అయితే ఇది ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా రాణిస్తూనే సినిమాలు చేయాలని ఫ్యాన్స్ లోని ఒక వర్గం కోరుకుంటుంది. ఆయన్ని సిల్వర్ స్క్రీన్ పై చూడటం వాళ్లకు ఒక పండగ లాంటిది.