రోజా పరువు తీసేసిన కిర్రాక్ ఆర్పీ
ఏపీ లో ప్రచార పర్వం ముగియడానికి నిండా మూడు రోజుల వ్యవధి కూడా లేదు. ఈ దశలో రాష్ట్రంలో ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా సీని పరిశ్రమ వారు రంగంలోకి దిగి పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచార రంగంలోకి దూకడంతో అక్కడి వాతావరణం సందడిగా మారిపోయింది. మరీ ముఖ్యంగా జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా విశేష ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న నటుల ప్రచారం వైసీపీ శ్రేణులను గుబెలెత్తిస్తోంది.మరీ ముఖ్యంగా ఆ కార్యక్రమానికి రోజా న్యాయనిర్ణేతగా వ్యవహరించడంతో వారి ప్రచారం వైసీపీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే జబర్దస్త్ నటుల గురించి రోజా చేసిన వ్యాఖ్యలకు క్రిర్రాక్ జబర్దస్త్ రిటార్డ్ ఇచ్చి ఆమె పరువును నిలువునా తీసేశారు. ఇంతకీ రోజా ఏమన్నారంటే.. జబర్దస్త్ నటులు చాలా చాలా చిన్న కళాకారులు అంటూ చులకనగా మాట్లాడడమే కాకుండా వాళ్లు కేవలం నాలుగు డబ్బుల కోసం మాత్రమే వారు పనన్ తరఫున ప్రచారం చేస్తున్నారంటూ విమర్శించారు. అదీ కాక, ఇప్పుడిప్పుడే సినిమాలలో వేషాలు వేస్తున్న వారు పవన్ కోసం ప్రచారం చేయకుంటే ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఊడిపోతాయన్న భయం కూడా వారి ప్రచారానికి కారణమని రోజా అన్నారు.
అయితే రోజా వ్యాఖ్యలను తప్పుపట్టిన కిర్రాక్ ఆర్పీ ఆమెకు దిమ్మదిరిగే రిటార్డ్ ఇచ్చాడు. రోజా ఏమన్నా గోప్ప స్టారా అంటూ.. జబర్దస్త్ కమేడియన్లతో పోలిస్తే ఆమె ప్రతిభ చాలా స్వల్పమని తీసి పారేశాడు. ఆమెకు ఏమైనా ఆస్కార్ అవార్డులు వచ్చాయా? జాతీయ పరుస్కారాలు ఏమైనా తీసుకున్నారా? అని ప్రశ్నించారు. గెటప్ శ్రీను, హైపర్, సుడిగాలి సుధీర్ వంటి వంటి వారి టాలెంట్ తో పోలిస్తే ఆమె నటనా సామర్ధ్యం ఏపాటిదని ఎద్దేవా చేశాడు. అంతే కాకుండా రాష్ట్రంలో ఓడిపోయే మొదటి సీటు రోజాదే అంటూ జోస్యం చెప్పాడు. ఆమెకు డిపాజిట్ దక్కితే గొప్పే అన్నాడు.మొత్తం మీద రోజా పిఠాపురంలో జనసేనానికి మద్దతుగా ప్రచారం చేసుకుంటూ తమ దోవన తాము వెడుతున్న జబర్దస్త్ కమేడియన్లను తక్కువ చేసి మాట్లాడి కెలుక్కున్నట్లైంది. కిర్రాక్ ఆర్పీ రిటార్డ్ తో ఆమెకు సౌండ్ లేకుండా పోయింది. ఇంత కాలం తన పట్ల ఎంతో గౌరవం ప్రదర్శించిన ఆర్పీలాంటి వారు ఒక్కసారిగా రివర్స్ అవ్వడంతో కంగుతిన్నారు. ఆర్పీ రిటార్డ్ రోజా పరువును రాష్ట్ర వ్యాప్తంగా తీసేసినట్లైందని పరిశీలకులు సైతం అంటున్నారు. తన సొంత నియోజకవర్గం నగరిలో సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్న రోజా అక్కడి ప్రచారాన్ని సజావుగా సాగించుకుని వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం చేసుకోకుండా జబర్దస్త్ కమేడియన్లను రెచ్చగొట్టి మరీ తిట్టించు కున్నట్లైం దంటు న్నారు.
Comments
0 comment