విదేశాల్లో జగన్ కుమార్తెలకు ఆస్తులు ఎన్ని కొట్లో తెలుసా ?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ,దేశంలో అత్యధిక ధనిక ముఖ్యమంత్రి  అని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. కానీ తాను పేదనని.. పెత్తందారులతో పోరాడుతుంటానని జగన్ చెబుతుంటారు. అయితే ఆయన ఆస్తులు విలువ అక్షరాల 529.87 కోట్లు కావడం గమనార్హం. ఆయన భార్య భారతి పేరిట మరో 176.63 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జగన్ తన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు,అప్పుల వివరాలను వెల్లడించారు.అయితే గత ఐదేళ్లలో జగన్ సంపద భారీగా పెరిగింది.మొత్తం కుటుంబ ఆస్తుల విలువ 757.65 కోట్లు.నోరు తెరిస్తే పేద సీఎంనని జగన్ చెబుతుంటారు.కానీ ఆస్తుల విలువ చూస్తే వందల కోట్లు ఉన్నాయి.వీటిల్లో అత్యధిక మొత్తం వివిధ కంపెనీల్లో వాటాలు,పెట్టుబడుల రూపంలో ఉన్నవే. 2019లో జగన్ ఒక్కరి ఆస్తులు విలువ 375.20 కోట్లు. ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన ఆస్తులు విలువ 154.67 కోట్ల మేర పెరిగింది. కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ 247.27 కోట్ల మేర పెరిగాయి. అయితే జగన్ తో పాటు కుటుంబ సభ్యులకు ఒక్కరికి సొంత కారు లేదట. జగన్ పేరుతో ఒక బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనం ఉంది. అది తన సొంతానిది కాదని.. హోం మంత్రిత్వ శాఖ సమకూర్చిన వాహనమని అఫిడవిట్లో ప్రస్తావించారు.సీఎం జగన్ కు ఏడు కంపెనీల్లో,ఆయన భార్యకు 22 కంపెనీల్లో, కుమార్తె హర్షిని రెడ్డికి ఏడు కంపెనీల్లో, వర్షా రెడ్డికి 9 కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి.పిల్లలిద్దరికీ విదేశాల్లో ఆస్తులు ఉండడం విశేషం. పెద్ద కుమార్తె హర్షిని రెడ్డికి రూ.1,31,75,471.. వర్షా రెడ్డికి రూ.1,54,78,466 విలువైన విదేశీ ఆస్తులు ఉన్నట్లు అఫీడవిట్లో పేర్కొన్నారు. మొత్తానికి అయితే తాను ఒక పేదను అని.. పెత్తందారులతో పోరాడుతున్నానని చెప్పిన జగన్ తన కుటుంబ ఆస్తులను అమాంతం పెంచుకోవడం విశేషం.